350 కోట్లు డిమాండ్ చేస్తున్నారట


Huge demond for Saaho all languages overseas rights

ప్రభాస్శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న ” సాహో ” చిత్ర ఓవర్ సీస్ హక్కుల కోసం ఏకంగా 350 కోట్లు డిమాండ్ చేస్తున్నారట యువి క్రియేషన్స్ అధినేతలు . సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహో . హాలీవుడ్ ని తలదన్నేలా గ్రాండ్ విజువల్స్ తో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి .

 

దాంతో తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ఓవర్ సీస్ హక్కుల కోసం ఓ సంస్థ 200 కోట్లకు పైగా ఇస్తామని ఆఫర్ ఇస్తే నో చెప్పేశారట సాహో నిర్మాతలు . 350 కోట్లు ఇస్తే అన్ని బాషల ఓవర్ సీస్  హక్కులు ఇస్తామని మొహమాటం లేకుండా చెప్పారట . దాంతో సాహో కోసం వచ్చిన వాళ్ళు పరుగులు పెట్టారట . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది దాంతో ఈ స్థాయిలో రేట్లు చెబుతున్నారు . అయితే ఆ సినిమా వేరు , ఈ సినిమా వేరు బాహుబలి స్థాయిలో రేట్లు చెబితే ఎలా అంటూ బయ్యర్లు గొణుగుతున్నారట .

English Title: Huge demond for Saaho all languages overseas rights