విజయ్ కి షాక్ ఇచ్చిన కోర్టు


Huge desappointment for vijay' s SARKAR

తమిళ స్టార్ హీరో విజయ్ కి షాక్ ఇచ్చింది చెన్నై కోర్టు . ఈనెల 6 న విజయ్ నటించిన సర్కార్ చిత్రం విడుదల అవుతున్న సందర్బంగా రెండు రోజుల పాటు అంటే 6 ఉదయం నుండి 7 వ తేదీ మొత్తం 48 గంటల పాటు నిర్విరామంగా బెనిఫిట్ షోలు వేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసారు . 48 గంటల పాటు ప్రత్యేక షోలు అంటే రికార్డుల మోత మోగడం ఖాయమని అనుకున్నారు కట్ చేస్తే …… ఈ విషయం కోర్టుకి ఎక్కడంతో 48 గంటల పాటు వేసే షోలకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు . అంతేకాదు తెల్లవారుఝామున వేసే ప్రత్యేక షోలకు కూడా అనుమతి లేకుండా చేసింది ఎందుకంటే దీపావళి పండగ కాబట్టి పెద్ద ఎత్తున జనాలు గూమి కూడితే ఏదైనా నష్టం జరిగే ప్రమాదం ఉంది అని అన్ని షోలకు అనుమతి నిరాకరించారు .

కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో అభిమానులతో పాటుగా చిత్ర యూనిట్ కూడా షాక్ అయ్యారు . సాదరంగా అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే బెనిఫిట్ షోలు తప్పనిసరిగా వేస్తారు . అందుకే భారీ ఎత్తున షోలు వేసి రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయని చెప్పాలని అనుకున్నారు కానీ అభిమానుల ఉత్సాహానికి కోర్టు బ్రేక్ వేసింది . విజయ్ నటించిన సర్కార్ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది .

English Title: Huge desappointment for vijay’ s SARKAR