సంజయ్ దత్ బయోపిక్ పై భారీ అంచనాలు


huge expectations on sanjay dutt biopicవివాదాస్పద హీరో సంజయ్ దత్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . డ్రగ్స్ కి బానిసై సంచలనం సృష్టించిన సంజయ్ దత్ ఆ తర్వాత డ్రగ్స్ ని మానేసి హీరోగా సంచలన విజయాలను అందుకున్నాడు అంతేకాదు ముంబై అల్లర్ల సమయంలో ఏకే 56 ని ఇంట్లో పెట్టుకొని జైలు కెళ్ళాడు సంజయ్ దత్ . అలాగే మాధురి దీక్షిత్ తో ప్రేమాయణం సాగించి ఆ రకంగా కూడా వివాదంలోకి ఎక్కాడు సంజయ్ .

కట్ చేస్తే ఆ సంజయ్ దత్ కథ తో ” సంజు ” బయోపిక్ తెరకెక్కుతోంది . సంజయ్ దత్ స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . రణ్ బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో నటిస్తున్నాడు . సంజయ్ దత్ గెటప్ లో రణ్ బీర్ కపూర్ చాలా బాగున్నాడు . రణ్ బీర్ కపూర్ గెటప్ లకు అద్భుత స్పందన వస్తోంది . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 29 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . బయోపిక్ లు పలు సంచలనాలు సృష్టిస్తున్న ఈ సమయంలో సంజయ్ దత్ బయోపిక్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి .