విజయ్ దేవరకొండ నోటా సంచలనమేనా


huge expectations on vijay devarakonda notaటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ” నోటా ” అక్టోబర్ 4న విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . కాగా రేపు ఆ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెలుగు , తమిళ బాషలలో రూపొందిన చిత్రం ఈ నోటా .తమిళ స్టార్ హీరోలు సూర్య – కార్తీ ల సమీప బంధువు అయిన జ్ఞానవేల్ రాజా ఈ నోటా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . విజయ్ దేవరకొండకు అనూహ్యమైన క్రేజ్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి .

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా తమిళనాట సంచలనం సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . తమిళ రాజకీయాలు గత రెండేళ్లుగా చిందరవందర అయిన విషయం తెలిసిందే . అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత తమిళ రాజకీయాలు గందరగోళ పరిస్థితిలో నెట్టివేయబడ్డాయి దానికి తోడు గతకొన్నాళ్ళుగా అన్నా డీఎంకే – డీఎంకే ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కూడా తమిళులను ఆలోచింపజేసేవిధంగా చేసింది . రాజకీయ ఆధిపత్యం కోసం సాగే రాజకీయ చదరంగంలో ప్రజలు ఎలా సమిధలు అవుతున్నారో , నీచ రాజకీయాలకు పాల్పడే వాళ్ళ ఆట కట్టించే యువనాయకుడిగా విజయ్ దేవరకొండ ఏం చేసాడన్నదే నోటా ఇతివృత్తమట . దాంతో తమిళనాట ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు . ఇక ట్రైలర్ రేపు విడుదల అవుతోంది కాబట్టి మరింత స్పష్టత వస్తుంది సినిమా రూపు ఎలా ఉండబోతోందో . మొత్తానికి గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ హీరో నోటా తో కూడా సంచలనం సృష్టించడం ఖాయమట .

English Title: huge expectations on vijay devarakonda nota