విజయ్ దేవరకొండ నోటాపై భారీ అంచనాలు


Huge expectations on Vijay devarakonda's NOTA

నిన్న విడుదలైన దేవదాస్ చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నోటా చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన ఈ నోటా చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. గీత గోవిందం చిత్రం ప్రభంజనం సృష్టించడంతో విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగింది. గీత గోవిందం చిత్రం కేవలం 12 కోట్ల బడ్జెట్ తో రూపొందింది కానీ వసూళ్ల పరంగా సునామీ సృష్టించి 120 కోట్ల పైచిలుకు వసూల్ చేసింది.

దాంతో నోటా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. నోటా చిత్రం కూడా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం . కానీ రెండు బాషలలో విడుదల అవుతుండటంతో నిర్మాతకు మాత్రం ఇప్పుడే భారీ లాభాలు వచ్చాయి. ఇక బయ్యర్లకు భారీ లాభాలు రావాలంటే నోటా పెద్ద హిట్ అవ్వాల్సిందే. దేవదాస్ చిత్రం ఎలాగూ డివైడ్ టాక్ కి నోచుకుంది కాబట్టి నోటా కు ప్లస్ అవుతుంది. అలాగే నోటా చిత్రం అక్టోబర్ 5న వస్తుండటంతో దేవదాస్ చిత్రానికి ఉన్న థియేటర్ లు పోవడమే కాకుండా వస్తున్న కలెక్షన్స్ కూడా తగ్గిపోవడం ఖాయం . విజయ్ దేవరకొండ రాజకీయ నాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మెహరీన్ జర్నలిస్ట్ గా నటించింది. ఇక అక్టోబర్ 5న విడుదల అవుతున్న నోటా తో తమిళనాట ఎలాంటి విజయాన్ని నమోదు చేయనున్నాడో ఆరోజే తెలిసిపోనుంది.

English Title: Huge expectations on Vijay devarakonda’s NOTA