విజయ్ దేవరకొండకు అక్కడ కూడా ఫాలోయింగ్


huge fan following for vijay devarakondaటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ కు రోజు రోజుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది . అది ఒక్క తెలుగునాట మాత్రమే కాకుండా తమిళ , కన్నడ , మలయాళ చిత్ర రంగాల్లో సైతం అభిమానులను పొందాడు గీత గోవిందం చిత్రంతో . అలాగే ఓవర్ సీస్ లో సైతం విజయ్ మేనియా మొదలయ్యింది . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి ,చిత్రాల తర్వాత ఇప్పుడు గీత గోవిందం చిత్రంతో టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతరించాడు విజయ్ దేవరకొండ . తెలుగునాట మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఆ అభిమానులకు థాంక్స్ చెబుతున్నాడు విజయ్ దేవరకొండ .

ఈ యంగ్ హీరోకు అనూహ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది . యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది విజయ్ దేవరకొండ చిత్రాలకు అందుకే రౌడీ క్లబ్ అంటూ స్టార్ట్ చేసాడు . తన వీరాభిమానులను ముద్దుగా రౌడీ గ్యాంగ్ గా పిలుచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ . మొత్తానికి గీత గోవిందం తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ .

English Title: huge fan following for vijay devarakonda