నష్టం తప్పదా ?


Huge loss for 2. 0 andhrapradesh buyers
Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ లో నష్టం తప్పదా ? అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో 75 కోట్ల కు కొన్నారు . భారీ ఎత్తన విడుదల చేసారు అలాగే భారీ వసూళ్లు కూడా సాధించింది . ఈ సినిమా ఇప్పటివరకు 48 కోట్ల షేర్ వసూల్ చేసింది , 48 కోట్ల షేర్ అంటే మాములు విషయం కాదు కానీ మరీ ఎక్కువ రేటుకి కొన్నారు కాబట్టి ఈ సినిమాని కొన్న వాళ్ళు లాభాల్లోకి రావాలంటే 75 కోట్ల షేర్ రావాలి .

కానీ ఆ మొత్తం వసూల్ కావడం కష్టమే అని తేలింది . తెలంగాణ లో దిల్ రాజు విడుదల చేయగా అక్కడ మంచి వసూళ్లు వచ్చాయి దాంతో నష్టం నుండి బయట పడ్డాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు దాంతో యువి క్రియేషన్స్ , ఎన్వీ ప్రసాద్ లకు నష్టాలు తప్పడం లేదని అంటున్నారు . 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈ 2. ఓ . రజనీ మేనియా , శంకర్ దర్శకత్వ ప్రతిభతో ఈ వసూళ్లు వస్తున్నాయి .

English Title: Huge loss for 2. 0 andhrapradesh buyers