9 కోట్లు కూడా రాబట్టని సవ్యసాచి

Huge loss for akkineni nagachaitanyaఅక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి మొత్తానికి డిజాస్టర్ గా తేలిపోయింది . వారం రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కనీసం 9 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది . ఈ సినిమాని 23 కోట్లకు కొన్నారు బయ్యర్లు అంటే ఇప్పటి లెక్కల ప్రకారం 14 కోట్ల నష్టం అన్నమాట ! సినిమా మరోటి పోటీ లేదు కాబట్టి ఇంకో కోటి షేర్ రాబడితే గొప్పే ! అంటే ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అన్నమాట . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది . నాగచైతన్య కున్న ఇమేజ్ పరిధి ఖర్చు పెట్టారు నిర్మాతలు . కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు వృధా అయినట్లే !

యాక్షన్ ఇమేజ్ కోసం నాగచైతన్య తహతహలాడుతున్నాడు . అయితే ఎన్ని పోరాటాలు చేసినా చైతూ కి మాత్రం యాక్షన్ ఇమేజ్ మాత్రం రావడం లేదు . కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దాన్ని సరైన దిశలో నడిపించలేకపోయాడు దర్శకుడు చందు మొండేటి . చైతూ నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో సమంత బాధపడుతోంది . ఇక చైతూ పరిస్థితి కొత్తగా చెప్పాలా ?

English Title: Huge loss for akkineni nagachaitanya