నష్టాల దిశగా డియర్ కామ్రేడ్


నష్టాల దిశగా డియర్ కామ్రేడ్
నష్టాల దిశగా డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్ చిత్రం నష్టాల దిశగా దూసుకుపోతోంది . వారం రోజులు ముగిసేసరికి కేవలం 21 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది డియర్ కామ్రేడ్ . ఓవర్ సీస్ లో నష్టం పక్కా అని తేలిపోయింది . ఇక నైజాం లో విజయ్ దేవరకొండ కు బాగా క్రేజ్ ఉండటంతో ఇక్కడ సేఫ్ అవుతాడని అనుకున్నారు కాని ఇక్కడ కూడా నష్టాలు తప్పేలా కనిపించడం లేదు . కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా భారీ నష్టాలు అయితే కావు .

ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ సినిమాని కొన్న బయ్యర్లు మొత్తంగా మునిగిపోతున్నారు . విజయ్ దేవరకొండ హీరో కాబట్టి ఆ క్రేజ్ తో కొన్నారు అలాగే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి అయితే సినిమాపై డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో పెద్ద దెబ్బే కొట్టింది . ఏపీలో ఈడియర్ కామ్రేడ్ ని రిలీజ్ చేసిన బయ్యర్లకు భారీ నష్టాలు వస్తున్నాయి . రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమా మొత్తంగా 10 కోట్ల నష్టం వచ్చేలా కనబడుతోంది.