23 కోట్ల నష్టాన్ని మిగిల్చిన కాలా


huge loss for kaala buyersరెండు తెలుగు రాష్ట్రాలలో 30 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది కాలా చిత్రానికి . రజనీకాంత్ కున్న మేనియా తో ఈ బిజినెస్ జరిగింది అయితే అప్పటికే అనుమానం ఉండే ఈ స్థాయి వసూళ్లు వస్తాయా ? లేక కబాలి లాగే అవుతుందా ? అని . కట్ చేస్తే కాలా సినిమా విడుదల అయ్యింది డిజాస్టర్ అయ్యింది . ఒక్క తమిళనాట తప్ప ప్రపంచ వ్యాప్తంగా భారీ దెబ్బ కొట్టింది కాలా చిత్రం . జూన్ 7న భారీ ఎత్తున విడుదలైన కాలా చిత్రానికి మొదటి రోజునే డిజాస్టర్ టాక్ వచ్చింది దాంతో రికార్డులు బద్దలు కాలేదు .

కాకపోతే రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి . మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సాధించిన వసూళ్లు 7 కోట్ల పై మాటే ! అంటే ఇంకా 23 కోట్ల నష్టం అన్నమాట ! ఈ సినిమాని ఇష్టపడి రజనీ కోసం పోటీపడిన వాళ్లకు 23 కోట్ల నష్టాన్ని మిగిల్చాడు . పా . రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కబాలి డిజాస్టర్ అయినప్పటికీ మళ్ళీ కాలా కు అవకాశం ఇచ్చాడు రజనీ , కానీ రెండోసారి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు పా రంజిత్ .