భారీ నష్టాలను మిగిల్చిన సాక్ష్యం


huge loss for sakshyam buyers

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం చిత్రం బయ్యర్లకు అలాగే నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది . దాదాపు నలభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై బెల్లంకొండ సురేష్ , సాయి శ్రీనివాస్ లతో పాటుగా దర్శకుడు శ్రీవాస్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కట్ చేస్తే మొదటి రోజునే డివైడ్ టాక్ వచ్చింది అయితే బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో మంచి వసూళ్లు వస్తాయేమో అని అనుకున్నారు దానికి తోడు మొదటి రోజు ,అలాగే రెండో రోజున వసూళ్లు బాగానే వచ్చాయి కానీ మూడో రోజు నుండి అసలు పరీక్ష మొదలు కాగా సోమవారం రోజునుండి పూర్తిగా కలెక్షన్లు పడిపోయాయి .

మోతంగా 10 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది సాక్ష్యం చిత్రం . అయితే శాటిలైట్ పరంగా , డిజిటల్ రైట్స్ , హిందీ రైట్స్ కలుపుకొని 13 కోట్లకు పైగా వచ్చాయి . అంటే నిర్మాత కు తక్కువ నష్టం వస్తోంది కానీ బయ్యర్లకు మాత్రం ఏకంగా 15 కోట్ల నష్టం వస్తోంది దాదాపుగా . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటించగా పంచ భూతాలు నేపథ్యంలో ఈ సాక్ష్యం ని రూపొందించారు . అయితే ఆ పంచభూతాలు మాత్రం సాక్ష్యం కు అండగా నిలవలేక పోయాయి దాంతో బయ్యర్లు నష్టాల పాలౌతున్నారు . మొత్తానికి ఇది బెల్లంకొండ కు పెద్ద గుణపాఠమే !

English Title: huge loss for sakshyam buyers