సవ్యసాచి నష్టమెంత ?

Huge loss for savyasachi buyersఅక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించిన చిత్రం సవ్యసాచి . నాగచైతన్య మార్కెట్ ని మించిన బడ్జెట్ పెట్టి మరీ సవ్యసాచి సినిమా నిర్మించారు . నమ్మకంతో 25 కోట్లకు పైగా పెట్టి నిర్మించారు . అయితే అందులో కనీసం సగం కూడా తిరిగి వచ్చేలా లేదు పరిస్తితి చూస్తుంటే . నవంబర్ 2 న విడుదలైన సవ్యసాచి చిత్రానికి ప్రారంభం బాగానే ఉన్నప్పటికీ , కొంత ఎంటర్ టైన్ మెంట్ ఉన్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అనిపించుకోలేదు . ఇప్పటివరకు 9 కోట్ల లోపే షేర్ వచ్చింది , ఇంకో కోటి షేర్ వస్తుందేమో లేదంటే 2 కోట్లు అంతకు మించి మాత్రం రావడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

మొత్తం మీద పది కోట్ల షేర్ వస్తే గొప్ప అని అంటున్నారు . అంటే సగం కూడా రావడం లేదు దాంతో బయ్యర్లకు పది కోట్లకు పైగా నష్టం రావడం ఖాయమని అంటున్నారు . 23 కోట్ల బిజినెస్ జరిగింది . శాటిలైట్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో మైత్రి మూవీస్ వాళ్ళకు కొంత గిట్టుబాటు అయ్యింది కానీ బయ్యర్లకు మాత్రం నష్టాలు తప్పడం లేదు . చందు మొండేటి ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా చేయడం తప్పు . మైత్రి మూవీస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ చాన్స్ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి చేజేతులా సవ్యసాచిని నష్టపరిచాడు . పాపం నాగచైతన్య కు సవ్యసాచి అచ్చిరాలేదు . యాక్షన్ హీరోగా సక్సెస్ సాధించాలని ఆశపడుతున్నాడు కానీ అది మాత్రం నెరవేరడం లేదు .

English Title: Huge loss for savyasachi buyers