ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించనున్న మహర్షి


మహేష్ బాబు కున్న క్రేజ్ తో మహర్షి చిత్రం ఓపెనింగ్స్ లో రికార్డ్స్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . ఇప్పటికే ఓవర్ సీస్ లో 2500 షోలు వేయడానికి డిసైడ్ అయిపోయారు , ప్రీమియర్ షోలతోనే బాక్స్ లు బద్దలు కొట్టేలా ఉన్నాడు మహేష్ . ఇక సినిమా టాక్ బాగుంటే రికార్డుల మోత మోగడం ఖాయం . ఓవర్ సీస్ మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలకు ప్రత్యేక అనుమతి లభించింది .

దాంతో రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయం . దానికి తోడు మొదటి వారం టికెట్ రేట్ల ని భారీగా పెంచుతున్నారు . దాంతో కూడా నాన్ బాహుబలి రికార్డులు దాదాపుగా తుడిచి పెట్టుకు పోవడం ఖాయం . మహేష్ బాబు కున్న క్రేజ్ ని ఈ వారం రోజులు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు . దానికి మరో కారణం కూడా ఉంది . మహర్షి సినిమా బడ్జెట్ 150 కోట్లు . దాంతో ఆ సొమ్ము ని ఎంత త్వరగా రాబడితే అంత మంచిది అనే ఉద్దేశ్యంతో ఉన్నారు ఆ చిత్ర బృందం .