శాటిలైట్ రైట్స్ లో రికార్డ్ సృష్టించిన మహేష్


Sarileru neekevvaru
Sarileru neekevvaru

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శాటిలైట్ రైట్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు . తాజాగా హీరో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మే 31 ప్రారంభమైన విషయం తెలిసిందే . సినిమా అయితే ప్రారంభం అయ్యింది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చేనెల నుండి జరుగనుంది

ఇక సినిమాకు బిజినెస్ సర్కిల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ప్రముఖ ఛానల్ అయిన జెమిని సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని 16. 5 కోట్లకు సొంతం చేసుకుంది . మహర్షి వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న చిత్రం కావడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో జెమిని ఛానల్ పోటీపడి 16 కోట్ల 50 లక్షలకు శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుందట . మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తున్న చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది