లాభాల బాటలో తాప్సీ గేమ్ ఓవర్


Game over
Game over

తాప్సీ నటించిన గేమ్ ఓవర్ ఈనెల 14 విడుదలైన విషయం తెలిసిందే . అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని శశికాంత్ నిర్మించాడు . గ్లామర్ పాత్రలను వదిలేసి విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ పోతున్న తాప్సీ కి వరుసగా విజయాలు దక్కుతున్నాయి . తెలుగు , తమిళ, హిందీ బాషలలో రూపొందిన గేమ్ ఓవర్ కేవలం 7 కోట్ల బడ్జెట్ తోనే రూపొందిందట

తక్కువ లొకేషన్ లు అలాగే ఎక్కువ నిడివి లేకపోవడంతో పాటుగా నటీనటులు కూడా చాలా పరిమిత సంఖ్యలో ఉండటంతో తక్కువ బడ్జెట్ లోనే సినిమా నిర్మాణం పూర్తయ్యిందట . అయితే జూన్ 14 విడుదలైన గేమ్ ఓవర్ కేవలం అయిదు రోజుల్లోనే 7 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది . అంటే పెట్టిన పెట్టుబడి అన్నమాట ! దీనికి తెలుగు , తమిళ , హిందీ బాషల శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ రూపంలో అవలీలగా 20 కోట్ల వరకు రావచ్చని అంటున్నారు అంటే లాభాలే లాభాలు అన్నమాట తాప్సీ గేమ్ ఓవర్ చిత్రానికి . మౌత్ టాక్ మరింతగా స్ప్రెడ్ అవుతుండటంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది . మొత్తానికి తాప్సీ గ్లామర్ ని పక్కన పెట్టి నటిగా సత్తా చాటుతోంది