ఒక్క పాట కోసం 2 కోట్లు తీసుకుందా ?


Jacqueline Fernandez
Jacqueline Fernandez

ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో శ్రీలంక హాట్ భామ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే . బ్యాడ్ బాయ్ అనే ఐటెం సాంగ్ లో జాక్వెలెన్ ఫెర్నాండేజ్ యమా హాట్ గా కనిపించింది . ఈ బ్యాడ్ బాయ్ అనే పాట రికార్డ్స్ క్రియేట్ చేసింది అయితే ఈ పాట కంటే జాక్ అందాల కోసమే ఎక్కువగా ఎగబడి చూసారు జనాలు . కాగా ఈ పాటలో నటించడానికి ఏకంగా 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట !

ఒక్క పాట కోసం 2 కోట్ల రెమ్యునరేషన్ అంటే మాటలు కాదు కానీ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కున్న క్రేజ్ కి ఆ భామ అందాలకు ఉన్న డిమాండ్ మేరకు ఈ సొమ్ము ఇచ్చారని తెలుస్తోంది . ఒకవేళ ఇదే సొమ్ము కనుక జాక్ తీసుకొని ఉంటే మంచి లక్కు అన్నట్లే ! ఇక సాహో ఆగస్టు 30 న అత్యధిక కేంద్రాల్లో విడుదల కానుంది . శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా జాక్వెలెన్ ఫెర్నాండేజ్ ఐటెం భామగా మెరిసింది .