అట్టర్ ప్లాప్ చిత్రం యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్


అట్టర్ ప్లాప్ చిత్రం యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్
అట్టర్ ప్లాప్ చిత్రం యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్

తెలుగులో విడుదలైన కవచం అట్టర్ ప్లాప్ అయ్యింది , అయితే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే బంపర్ హిట్ అయ్యింది . కేవలం ఒక్క రోజులోనే ఒక కోటి అరవై లక్షల వ్యూస్ వచ్చాయి . దాంతో తక్కువ సమయంలోనే క్కువ వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది హిందీ కవచం . అన్నట్లు హిందీ లో ఈ సినిమాకు పేరేంటో తెలుసా ఇన్ స్పెక్టర్ విజయ్ .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది . పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించాడు . తెలుగులో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికి ఒక్క హిట్ కూడా దక్కించుకోలేక పోయాడు పాపం .