అదరగొట్టిన 2.0 టీజర్


Huge responce for Rajinikanth 2.0 teaser

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ” 2. 0 ” చిత్ర టీజర్ ని ఈరోజు విడుదల చేసారు ఆ చిత్ర బృందం . ఈరోజు వినాయకచవితి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేసిన టీజర్ ప్రభంజనం సృష్టిస్తోంది . రజనీకాంత్ , అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం రోబో చిత్రానికి సీక్వెల్ కాదు అని అన్నాడు శంకర్ కానీ రోబో చిత్రానికి కొనసాగింపుగానే ఈ సినిమా టీజర్ ఉంది . రోబో లో చిట్టి ప్రళయాన్ని సృష్టించగా ఈ సీక్వెల్ లో మాత్రం ప్రపంచానికి రాబోతున్న ప్రళయాన్ని ఆపడానికి చిట్టి ఉపయోగపడింది టీజర్ చూస్తుంటే .

భారీ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి , అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2. 0 చిత్రం పై ఈ టీజర్ తో భారీ అంచనాలు నెలకొనడం ఖాయం . శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ 545 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది . రజనీకాంత్ సైంటిస్ట్ గా చిట్టి రోబోగా నటించగా విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు . ఇక రజనీ సరసన అమీ జాక్సన్ నటించింది . ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురయ్యేలా చేస్తున్నాయి . విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ టీజర్ కు ప్రేక్షకులనుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది .

English Title: Huge responce for Rajinikanth 2.0 teaser