దుమ్మురేపుతున్న రేస్ 3 ట్రైలర్


huge response for race 3 trailer

సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 ట్రయిలర్ విడుదల కావడమే ఆలస్యం యు ట్యూబ్ లో దుమ్ము రేపుతోంది . అసలు ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ? అని చేతిలో మొబైల్ పట్టుకొని , మరికొంతమంది సిస్టం ల ముందు కూర్చొని ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు రేస్ 3 కి ఎంతగా డిమాండ్ ఉందో . పైగా ఈ మూడో సిరీస్ లో హీరో సల్మాన్ ఖాన్ కావడంతో ఎప్పుడొస్తుందా ? ఎప్పుడెప్పుడు ట్రైలర్ చూస్తామా ? అన్న అతృతతో ఎదురు చూసారు .

నిన్న సాయంత్రం ట్రైలర్ విడుదల అవ్వడమే ఆలస్యం క్లిక్ ల మీద క్లిక్ లతో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది . క్షణాల్లోనే లక్షల వ్యూస్ తో మిలియన్ ల బాటలో పయనిస్తోంది . సల్మాన్ ఖాన్ అద్భుత విన్యాసాలు , అందాల భామలు జాక్వెలెన్ ఫెర్నాండేజ్ , డైసీ షా అందాలు ఈ సినిమాకు మరింత అదనపు ఆకర్షణ గా నిలవనున్నాయి . రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టిప్స్ తో కలిసి సల్మాన్ ఖాన్ నిర్మించడం విశేషం . రేస్ సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాలు కూడా పెద్ద హిట్ కావడంతో ఈ రేస్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ సినిమా విడుదలయ్యాక రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది .