అంత సేపు ఏం చెప్తావ్ వాల్మీకి


Valmiki
అంత సేపు ఏం చెప్తావ్ వాల్మీకి

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ విలనీగా తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్, ట్రైలర్, విడుదలైన రెండు పాటల వల్ల సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా హరీష్ శంకర్ ఈ సినిమాపై ధీమాగా ఉన్నాడు. తమిళ్ చిత్రం జిగర్తాండకు తనదైన శైలిలో మార్పులు, చేర్పులు చేసి వాల్మీకిని తీర్చిదిద్దాడు హరీష్ శంకర్. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం దీని నిడివి 2 గంటల 51 నిమిషాలుగా తేలింది. తమిళ్ చిత్రం దీనికి 13 నిమిషాలకు పైగా తక్కువ నిడివితో తెరకెక్కింది.

అయితే హరీష్ శంకర్ ఒరిజినల్ లో లేని కామెడీ ఎపిసోడ్స్ తో పాటు మసాలా అంశాలను కూడా జోడించడంతో నిడివి పెరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ యాక్టింగ్, హరీష్ శంకర్ టేకింగ్ తప్ప ఈ సినిమాను వేరే అంశాలు కాపాడలేకపోవచ్చు. ఎందుకంటే మరో హీరో అధర్వ తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేడు. మరో హీరోయిన్ మృణాళిని పేరు కూడా మనవాళ్లకు తెలీదు. కంటెంట్ బాగుంటే ఎంత రన్ టైమ్ అయినా ఏం కాదు కానీ, కంటెంట్ లో తేడా వస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. దీనికి తాజా ఉదాహరణ ఇటీవలే విడుదలైన సాహో.