ఎన్టీఆర్ -చరణ్ లకోసం భారీ సెట్


huge set for ntr and charans movie

బాహుబలి తో తన ఖ్యాతి ని ప్రపంచ వ్యాపితం చేసుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే . గతకొంత కాలంగా రాజమౌళి ఆ సినిమా స్క్రిప్ట్ పైనే ఉన్నాడు ఇక ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేస్తున్న సెట్ పైనే అతడి దృష్టి అంతా ఉంది . రాజమౌళి ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడట ! సినిమా ఎప్పుడో అక్టోబర్ లో కదా ప్రారంభం అయ్యేది మరి ఇప్పుడే సెట్స్ వేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ?

అక్టోబర్ లో ఎన్టీఆర్ – చరణ్ ల సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది కాబట్టి భారీ సెట్ వేస్తున్నారట ! అక్కడ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న . డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం మల్టీ స్టారర్ చిత్రాల్లోనే మైలురాయి గా నిలిచిపోవాలని భావిస్తున్నాడు జక్కన్న . పైగా బాహుబలి సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాల తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .