ప్రభాస్ తప్పు చేస్తున్నాడా ?Huge settings for Prabhas's John

ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ” జాన్ ” అనే చిత్రం కూడా చేస్తున్నాడు . ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలతో పలు సెట్ లు నిర్మిస్తున్నారు . కేవలం సెట్టింగ్ లకే 80 కోట్లు అంటే ఇక టోటల్ సినిమా మేకింగ్ 150 కోట్లను దాటడం ఖాయమని తెలుస్తోంది .

 

యూరప్ సెట్స్ ని ఇక్కడ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేస్తున్నారు . దీనికి ఇంతటి భారీ ఖర్చు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు . ఈ స్థాయి బడ్జెట్ పెరుగుతూ పోతుంటే అది చిత్ర పరిశ్రమకు ఎంతమాత్రం మంచిది కానేకాదు ఎందుకంటే సంవత్సరంలో 150 కి పైగా సినిమాలు రిలీజ్ అయితే అందులో పట్టుమని పది సినిమాలు హిట్స్ ఉండటం లేదు . ఇక బ్లాక్ బస్టర్ ల సంగతి జస్ట్ ఒకటి లేదా రెండు మాత్రమే ! కానీ బడ్జెట్ ని మాత్రం ఎవరికీ వాళ్ళు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు . ఈ క్రమంలో ప్రభాస్ కూడా అదే పని చేస్తున్నాడు . హిట్ కొడితే ఫరవాలేదు కానీ తేడా వస్తేనే ఎంత తప్పు చేసాడో తెలుస్తుంది . అప్పుడు తెలిసినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే అప్పటికే ఎంతో మంది రోడ్డున పడతారు .