రాజశేఖర్ సినిమాకు ఇబ్బందులు


hyderabad civil court orders on rajasekhars  psv garudavega రాకరాక పదేళ్ల తర్వాత రాజశేఖర్ కు హిట్ లభించింది గరుడవేగ చిత్రంతో . కానీ ఇప్పుడా చిత్రం ప్రదర్శించడానికి వీలు లేదు అంటూ కోర్టు నోటీసులు ఇవ్వడంతో రాజశేఖర్ తో పాటు ఆ చిత్ర బృందం తీవ్ర షాక్ లో ఉన్నారు . అసలు కోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా ……. గరుడ వేగ చిత్రంలో యురేనియం స్కామ్ గురించి దానికి పాల్పడిన వాళ్ళ అంతు హీరో ఎలా చూసాడు అన్న కథాంశంతో రూపొందింది .

ఈ యురేనియం ప్లాంట్ నుండి అక్రమంగా ప్లూటోనియం , థోరియం లను తరలించినట్లు అందులో రాష్ట్ర మంత్రి తో పాటుగా కేంద్ర మంత్రి పాత్ర ఉన్నట్లుగా సినిమాలో చూపించారని హీరో ఏమో ఎన్ ఐ ఏ కి చెందిన వ్యక్తిగా చూపించి మా మనోభావాలను కించ పరిచారని యురేనియం ఉద్యోగులు కోర్టు కెక్కడంతో ఒక నెల రోజుల పాటు గరుడ వేగ చిత్రాన్ని అన్ని చోట్లా ప్రదర్శించ వద్దని నెలలో తుది తీర్పు ఇస్తామని తెలిపారు దాంతో రాజశేఖర్ సినిమాకు ఇబ్బందులు వచ్చాయి . సినిమా మంచి హిట్ అయ్యిందని సంతోష పడుతున్న సమయంలో రాజశేఖర్ ఆశలు ఆవిరయ్యాయి .