కేసీఆర్ ని ఘోరంగా తిట్టిన మహిళ


Hyderabadi Lady fires on kcr

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెలుగుదేశం పార్టీ అభిమాని అయిన ఓ మహిళ ఘోరంగా అవమానించింది. నువ్వసలు ముఖ్యమంత్రి వేనా ? మా నాయకుడు చంద్రబాబు నాయుడు ని ఇంత ఘోరంగా అవమానిస్తావా ? మూడు నెలలు ఫామ్ హౌజ్ లో పండుకునే నువ్వా మా చంద్రబాబుని తిట్టేది ? నీదసలు నోరెనా ? నీలాంటోడు మాకు ముఖ్యమంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం అంటూ నిప్పులు చెరిగింది సదరు మహిళా.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఆంధ్రోళ్లు కూడా ఇక్కడి బిడ్డలే ! వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని అన్నారు , మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని అన్నావ్ ! మూడు నెలల్లోనే హైదరాబాద్ రూపు రేఖలు మార్చుతానని నీ కొడుకు అన్నాడు . ఏమైంది ఎన్నికలు అయిపోయినాయ్ ఆంధ్రోళ్లని , చంద్రబాబు ని తిట్టడం మొదలు పెట్టినవ్ అంటూ కేసీఆర్, కేటీఆర్ లను ఘోరంగా విమర్శించింది తెలుగుదేశం కార్యకర్త .

అంతేనా హైదరాబాద్ అభివృద్ధికి నిరంతరం కృషి చేసింది చంద్రబాబు నాయుడే , అతడి కృషి వల్లే ప్రపంచంలో హైదరాబాద్ కి ప్రత్యేకత లభించింది. రాష్ట్రం విడిపోయిన తరువాత నీ చేతిలో అధికారం పెడితే ఏం చేశావ్ ! ఫామ్ హౌజ్ లో పండు కున్నావ్ నువ్వా మా చంద్రబాబు ని తిట్టేది. ఇక్కడేమో ఆంధ్రోళ్లు మా వొల్లే అంటున్నావు గ్రామాల్లోకి వెళ్లి ఆంధ్రోళ్లని తిడుతున్నావ్ అంటూ మీడియా ముందే తిట్టేసింది. ఇటీవల కేసీఆర్ చంద్రబాబుని ఘోరంగా అవమానించడంతో దానికి ప్రతిగా తెలుగుదేశం శ్రేణులు ఇలా స్పందించారు. ప్రస్తుతం సదరు మహిళ కేసీఆర్ తిట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.