రామ్‌తో కొత్త ప్ర‌యాణం బాగుంది: సునీత

రామ్‌తో కొత్త ప్ర‌యాణం బాగుంది: సునీత
రామ్‌తో కొత్త ప్ర‌యాణం బాగుంది: సునీత

ప్ర‌ముఖ గాయ‌ని సునీత రెండో పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. సింగ‌ర్‌గా ఎన్నో అద్భుత‌మైన పాట‌ల్ని అందించి గాయ‌నిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. భ‌ర్త కిర‌ణ్‌తో గ‌త కొన్నేళ్ల క్రితం విడిపోయిన సునీత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి జీవిస్తోంది. అయితే ఈ క్ర‌మంలో ఈ నెల 9న బంధు మిత్రుల స‌మ‌క్షంలో సునీత.. రామ్ వీర‌ప‌నేనిని వివాహం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న పెళ్లి వెన‌కున్న ర‌హ‌స్యాన్ని సునీత వెళ్ల‌డించింది. గ‌త కొన్నేళ్ల క్రితం నుండి త‌న‌కు సంబంధించిన సోష‌ల్ మీడియా అకౌంట్‌ల‌ని రామ్‌ వీర‌ప‌నేని చూసుకుంటున్నార‌ని, ఆ స‌మ‌యంలోనే మా ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, ఆ ప‌రిచ‌యం ఆ త‌రువాత మ‌రింత బ‌ల‌ప‌డిందని స్ప‌ష్టం చేసింది సునీత‌. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రం పెళ్లి చేసుకోవాల‌నుకున్నామ‌ని, ఆ నిర్ణ‌యాన్ని ఇరు కుటుంబాలకు వెల్ల‌డించామ‌ని తెలిపింది.

త‌మ నిర్ణ‌యానికి వారు ఎంతో సంతోషించార‌ని, మా నిర్ణ‌యాన్ని నా పిల్ల‌లు స్వాగ‌తించారు. న‌న్ను అర్థం చేసుకునే కుటుంబం నా సొంతం కావ‌డం నిజంగా నా అదృష్టం. క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల అతి త‌క్కువ మంది కుటుంబం స‌భ్యుల స‌మ‌క్షంలో వివాహం చేసుకోవాల‌కున్నాం. అయితే మా ఇద్ద‌రివి పెద్ద కుటుంబాలు కావ‌డంతో అది కుద‌ర‌లేదు. పెళ్లికి 200 మంది హాజ‌ర‌య్యారు` అని తెలిపింది సునీత‌.