అత్యంత బెస్ట్ ఫేజ్‌లో వున్నాను : శృతిహాసన్


అత్యంత బెస్ట్ ఫేజ్‌లో వున్నాను : శృతిహాసన్
అత్యంత బెస్ట్ ఫేజ్‌లో వున్నాను : శృతిహాసన్

`క్రాక్` విజయంతో శృతి హాసన్ కెరీర్ స‌రికొత్త మ‌లుపు తిరిగింది.  ప్ర‌భాస్ న‌టిస్తున్న `స‌లార్‌` చిత్రంతో పాన్ ఇండియా స్థాయి చిత్రాల హీరోయిన్‌ల జాబితాలోకి చేరిపోయింది. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శృతి న‌టిస్తున్న‌ట్టు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. శృతి త‌న‌ 35 వ‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల‌తో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకుంది.

గ‌తంతో పోలిస్తే ప్రస్తుతం త‌న దశ మారింద‌ని, అత్యుత్త‌మ ఫేజ్‌లో తాను వున్నాన‌ని వెల్ల‌డించింది. `మ‌న‌సంతా కృతజ్ఞత, ఆనందంతో నిండి ఉంది .  ఇది నా జీవితంలో అత్యుత్తమ దశ. నాకు నేర్పిన‌ పాఠాలు.. నా  ప్రయాణానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను… కాంతి మరియు సృజనాత్మకతతో నిండిన నా కోసం నేను కోరుకునే భవిష్యత్తు గురించి నా దృష్టిని తీర్చిదిద్దిన మార్గాల్లో నేను మారిపోయాను. న‌న్ను నేను మార్చుకున్నాను.  నా పుట్టినరోజును చాలా ప్రత్యేకమైనదిగా మార్చినందుకు  థాంక్యూ`అని శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పంచుకున్నారు.

ప్ర‌స్తుతం శృతి `స‌లార్‌` చిత్రంతో పాటు త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న `లాభం`తో పాటు తెలుగులో `వకీల్ సాబ్`లో అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.  ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)