కోర్టుని ఆశ్ర‌యిస్తానంటున్నరాధిక‌!

కోర్టుని ఆశ్ర‌యిస్తానంటున్నరాధిక‌!
కోర్టుని ఆశ్ర‌యిస్తానంటున్నరాధిక‌!

గ‌త రెండు రోజుల క్రింత చెక్ బౌన్స్ కేసులో సైదాపేట కోర్టు రాధిక‌, శ‌ర‌త్‌కుమార్‌ల‌కు ఏడాది జైలు శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వార్త‌ల్లో నిలిచిన న‌టి రాధిక తాజాగా శుక్ర‌వారం మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇటీవ‌ల బాలీవుడ్ టు కోలీవుడ్ వ‌ర‌కు సినీ సెల‌బ్రిటీలు చాలా మంది కోవిడ్ బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే కొంత మందికి క‌రోనా సోకుతున్నా మరి కొంత మందికి సోక‌క‌పోయినా వారిపై వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల్ని కొంత మంది లైట్ తీసుకుంటుంటే రాధిక మాత్రం సీరియ‌స్‌గా తీసుకున్నారు. తన‌కు క‌రోనా సోక‌లేద‌ని త‌న ఆరోగ్యంపై వ‌దంతులు సృష్టిస్తున్నార‌ని వారిపై కోర్టుని ఆశ్ర‌యిస్తాన‌ని రాధిక తాజాగా హెచ్చ‌రించింది. ఆన్ లైన్‌లో త‌న ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వ‌స్తున్నాయ‌ని శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు.

`మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాల‌‌కు ధ‌న్య‌వాదాలు. నాకు క‌రోనా వైర‌స్‌ సోక‌లేదు. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న త‌రువాత స్వ‌ల్పంగా ఒళ్లు నొప్పులు వ‌చ్చాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే వున్నాను. వృత్తిప‌ర‌మైన జీవితంలో బిజీగా వున్నాను. ఆరోగ్యం గురించి కొంత మంది ఇలాంటి వ‌దంతుల్ని పుట్టిస్తున్నారు. ఈ పుకార్లు వ్యాప్తిచేస్తున్న వారిపై న్యాయ‌స్థానంలో పోరాటం చేస్తా`అని తెలిపారు.