ట్విట్ట‌ర్ లో `ఉప్పెన‌` స్టార్ ఫేక్ అకౌంట్‌‌!

ట్విట్ట‌ర్ లో `ఉప్పెన‌` స్టార్ ఫేక్ అకౌంట్‌‌!
ట్విట్ట‌ర్ లో `ఉప్పెన‌` స్టార్ ఫేక్ అకౌంట్‌‌!

`ఉప్పెన‌` చిత్రంతో స్టార్‌గా మారిన యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్‌. క‌రోనా కార‌ణంగా ఏడాది ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించింది. ఈ మూవీతో ఒక్క‌సారిగా వైష్ణ‌వ్ తేజ్ పాపుల‌ర్ అయిపోయారు. ఈ మూవీ త‌రువాత రాకెట్ వేగంతో క్రిష్ చిత్రాన్ని పూర్తి చేసిన వైష్ణ‌వ్ తేజ్ త్వ‌ర‌లో మ‌రో చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నాడు.

ఇదిలా వుంటే త‌న పేరుతో సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్‌ని క్రియేట్ చేశార‌ట‌. ఇదే విష‌యాన్ని వైష్ణ‌వ్ తేజ్ మీడియా ముఖంగా వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో త‌న‌కు ఎలాంటి ఖాతా లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న పేరుతో వున్న ఫేక్ అకౌంట్‌ని ఎవ‌రూ ఫాలో కావ‌ద్ద‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

`నేను ట్విట్ట‌ర్‌లో భాగం కాదు. నాకు అందులో ఎలాంటి ఖాతా లేదు. అలాంటి ఖాతాల గురించి రిపోర్ట్ చేయండి. అలాంటి ఖాతాల విష‌యంలో అప్ప‌మ‌త్తంగా వుండండి` అని స్ప‌ష్టం చేశారు. `ఉప్పెన‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో వైష్ణ‌వ్ తేజ్ పేరుతో ట్విట్ట‌ర్‌లో ఓ ఖాతా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆ ఖాతాని ఫాలో కావ‌డం ప్రారంభించారు. ఈ విష‌యం తెలిసింసి వైష్ణ‌వ్ తేజ్ వివ‌ర‌ణ ఇచ్చారు.