ఇంట్లో వాళ్ల‌ని కూడా ప‌ల‌క‌రించ‌డం లేద‌ట‌!


ఇంట్లో వాళ్ల‌ని కూడా ప‌ల‌క‌రించ‌డం లేద‌ట‌!
ఇంట్లో వాళ్ల‌ని కూడా ప‌ల‌క‌రించ‌డం లేద‌ట‌!

కారోనా వైర‌స్ అంద‌రిని దూరం చేస్తోంది. బందువుల‌ని ఇంటికి రాకుండా చేస్తోంది. బందువుల ఇంటికి వెళ్ల‌కుండా చేస్తోంది. అంతేనా చివ‌రికి ఇంట్లో వున్న వాళ్ల‌ని కూడా ప‌ల‌కరించ‌కుండా చేస్తోంద‌ట‌. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ నిరూపించారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఇటీవ‌లే క్షేమంగా ఇంటికి వ‌చ్చారు.

గాయ‌నిగా జాతీయ స్థాయి పుర‌స్కారాలు అందుకున్న ల‌తా మంగేష్క‌ర్ ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా గ‌త కొన్ని రోజుల క్రితం చికిత్స కోసం ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం కోలు కోవ‌డంతో ఆమెని డిచ్చార్జ్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంటి ప‌ట్టునే వుంటున్న లతా మంగేష్క‌ర్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతుండ‌టంతో త‌న ఇంటి వారినే ప‌ల‌క‌రించ‌డం లేద‌ట‌.

ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కూర్చుని ముచ్చ‌టించ‌డం లేద‌ని, త‌న వ్య‌క్తిగ‌త డాక్ట‌ర్, న‌ర్సులు చెప్పిన నిబంధ‌న‌ల్ని పాటిస్తూ హ‌లో అన్నా కూడా తాను ప‌ల‌కడం లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌న పాట‌లు ఒక్క‌సారి రికార్డింగ్ అయిపోయాక త‌ను విన‌న‌ని, ప్ర‌స్తుతం దేవుడి పూజ‌లు చేస్తూ, టీవి చూస్తూ స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాన‌ని వెల్ల‌డించింది.