చరణ్ తర్వాత ఆ విషయంలో నేనే – వరుణ్


VarunTej
చరణ్ తర్వాత ఆ విషయంలో నేనే – వరుణ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో రెండు రోజుల్లో విడుదల కానున్న వాల్మీకి చిత్ర ప్రమోషన్లలో తలమునకలై ఉన్నాడు. వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు వీలైనంత హైప్ తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక విలేఖరి చిరంజీవి బయోపిక్ తీస్తారని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తీస్తే కనుక చిరంజీవి రోల్ లో మీరు నటిస్తారా? అని అడిగారు.

దానికి వరుణ్ ఏ మాత్రం తడుముకోకుండా “చిరంజీవి గారి పాత్రకు నాకన్నా చరణ్ అన్న చేస్తే బాగుంటుంది. ఒకవేళ తను చేయకపోతే మాత్రం సెకండ్ ఛాయస్ నేనే. తప్పకుండా చేస్తాను. ఆ మధ్య హరీష్ శంకర్ చిరంజీవి గారి బయోపిక్ తీస్తాను అని అన్నారు. అది ఎంతవరకూ జరుగుతుందో చూడాలి” అని సమాధానం ఇచ్చాడు. చరణ్ తర్వాత ఆ రోల్ కు నేనే సెకండ్ ఛాయస్ అని ప్రకటించుకోవడం అక్కడి మీడియా దృష్టిని ప్రధానంగా ఆకర్షించింది.