రాజకీయాలంటే అసహ్యమంటున్న విజయ్ దేవరకొండ


I bloody hate politics Vijay devarakondaడర్టీ పాలిటిక్స్ అంటే నాకు పరమ అసహ్యమని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ . అయితే రాజకీయాలను ఎంతగా అసహ్యించుకుంటాడో ,అదేపనిగా ప్రజలకోసం పనిచేయాల్సి వస్తే తాను చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా చాటి చేబుతాడట అందుకే చెబుతున్నాడు నాకు రాజకీయాలంటే అసహ్యం కానీ నేను రాజకీయాలు చేయాల్సి వస్తే ఇలా ఉంటుందని నోటా చిత్రం ద్వారా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ . తెలుగు , తమిళ బాషలలో తెరకెక్కుతున్న చిత్రం నోటా . కాగా సెప్టెంబర్ 6న ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా అక్టోబర్ 4న సినిమాని తెలుగు , తమిళ బాషలలో విడుదల చేయనున్నారు .

జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న నోటా చిత్రానికి శంకర్ ఆనంద్ దర్శకత్వం వహించాడు . రాజకీయాల నేపథ్యంలో నోటా చిత్రం రూపొందింది అయితే నోటా ఓటుకి ప్రాధాన్యత పెరిగింది ఇటీవలి కాలంలో . రాజకీయాలు ఇటీవలి కాలంలో మరింతగా దిగజారాయి దాంతో ఆ ఇతివృత్తంతో నోటా తెరకెక్కింది. విజయ్ దేవరకొండ సరసన మెహరీన్ కౌర్ నటించగా కీలక పాత్రల్లో సత్యరాజ్ , నాజర్ లు నటించారు . ఇక విజయ్ దేవరకొండ రాజకీయం ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 4వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: I bloody hate politics: vijay devarakonda