ఎన్టీఆర్ కథానాయకుడుపై విమర్శలు చేసిన వర్మ


I Couldn't see NTR in NTR kathanayakudu says ramgopal varma

దర్శకులు రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద వ్యక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే . తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు పై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నాకు ఎక్కడా ఎన్టీఆర్ కనిపించలేదని , బాలయ్యే కనిపించాడని ఎన్టీఆర్ కొడుకు కాబట్టి బాలయ్య లో కొన్ని పోలికలు ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ కథానాయకుడు ట్రైలర్ లో ఎక్కడా నాకు ఎన్టీఆర్ కనిపించలేదు అంతేకాదు నేను ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూడలేదు అంటూ ఇజ్జత్ తీసి పడేసిండు.

అంతేకాదు నేను తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ పాత్రధారి అచ్చం ఎన్టీఆర్ లా ఉంటాడు , అతడ్ని నేను ఎక్కడి నుండో తీసుకురాలేదు గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడి తో ఎన్టీఆర్ పాత్ర చేయిస్తున్నాను అంటూ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అన్ని వాస్తవాలే ఉంటాయి తప్ప అబద్దాలు కాదు అంటూ మరింతగా రెచ్చగొడుతున్నాడు బాలయ్య ని . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం జనవరి 9 న విడుదలై ప్లాప్ అయిన విషయం తెలిసిందే .

English Title: I Couldn’t see NTR in NTR kathanayakudu says ramgopal varma