ఎన్టీఆర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సైరా దర్శకుడు


I have directed ashok without any interest says surender reddy
I have directed ashok without any interest says surender reddy

సైరా నరసింహారెడ్డి సినిమాతో అందరూ ఆశ్చర్యపోయే అవుట్ ఫుట్ ని ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. నిజానికి సైరా ప్రాజెక్ట్ ఇతని చేతుల్లో పెడుతున్నప్పుడు ఎవరూ కూడా ఇంత మంచి సినిమా తీస్తాడని ఊహించలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ను సురేందర్ హ్యాండిల్ చేయగలడా అని అందరూ సందేహాలు వ్యక్తం చేసారు. కానీ సురేందర్ రెడ్డి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సైరాతో దుమ్ము లేపాడు. యుద్ధ సన్నివేశాలు కానీ, అంత భారీ బడ్జెట్ ను హ్యాండిల్ చేయడంలో కానీ, భారీ కాస్ట్ ను డీల్ విధానంలో కానీ సురేందర్ రెడ్డి అందరి అంచనాలను తలకిందులు చేసాడు. రిజల్ట్ సంగతి పక్కనపెడితే సైరా ఒక మంచి ప్రోడక్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిగతా భాషల రిజల్ట్ సంగతెలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో సైరా బాగా ఆడింది. 100 కోట్ల కలెక్షన్ షేర్ ను దాటి నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది. మొత్తంగా సైరాతో సురేందర్ భారీ సినిమాలను కూడా హ్యాండిల్ చేయగలడని నిరూపించాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. మహేష్ బాబు లేదా ప్రభాస్ తో తన నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఇద్దరినీ కలిసి చర్చించినట్లు తెలుస్తోంది.

ఇది పక్కనపెడితే సురేందర్ రెడ్డి ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఎన్టీఆర్ తో సినిమాను తన ఇష్టం లేకుండా చేసినట్లు తెలిపి అందరికీ షాక్ నిచ్చాడు. అసలు సురేందర్ రెడ్డి తొలి సినిమా అతనొక్కడే ఒక సంచలనం. కొత్త దర్శకుడు, ఫామ్ లో లేని హీరో కలిసి సినిమా చేస్తున్నారంటే ఎవరూ ఈ చిత్రం హిట్ అవుతుందని అనుకోలేదు. అయితే సురేందర్ రెడ్డి, కళ్యాణ్ రామ్ కి బెస్ట్ రివెంజ్ డ్రామాను అందించాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డికి బాగానే క్రేజ్ వచ్చింది. అతనొక్కడే తర్వాత సురేందర్ రెడ్డి, ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసి దానికి తగ్గ కథను రాసుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ మేనేజర్ తనను కలిసాడని, అశోక్ కథను తనకు ఇచ్చి దర్శకత్వం చేయాలని కోరాడని తెలిపాడు. తనకు ఆసక్తి లేదని చెప్పినా వినకుండా, నేనేం చెప్పినా పట్టించుకోకుండా ఎక్కడ షూట్ చేద్దాం. ఎప్పుడు మొదలుపెడదాం అన్నట్లుగా మాట్లాడేవాడని.. అప్పటికే ఎన్టీఆర్ పెద్ద హీరో కావడంతో ఒప్పుకోకపోతే ఏమవుతుందోనన్న ఉద్దేశంతో అశోక్ చేసినట్లు తెలిపాడు. అందుకే ఆ సినిమా ఫలితం అలా వచ్చిందని సురేందర్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ చెప్పకుండా అతని మేనేజర్ సురేందర్ రెడ్డిని అంతలా ఇబ్బంది పెడతాడని మనం అనుకోలేం. అంతలా ఇబ్బంది పెట్టి మరీ సురేందర్ తో సినిమా చేయాల్సిన అవసరం ఎన్టీఆర్ కు ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే తర్వాత ఊసరవెల్లి సినిమా కూడా తెరకెక్కడం విశేషం. ఆ సినిమా కూడా ప్లాప్ అయింది.