నాకు అభిమానులు ఆంధ్ర లో కూడా వున్నారు – విజయ్ దేవరకొండ


I have followers in Andhra - Vijay Devarakonda

నేను తెలంగాణ వాడ్ని అయినప్పటికీ నాకు అభిమానులు ఆంధ్ర లో కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో విజయ్ దేవరకొండ. నోటా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల విజయవాడ వెళ్లిన విజయ్ దేవరకొండ నేను తెలంగాణ వాడ్ని అంటూ ప్రాంతీయతని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. ప్రాంతీయత ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులలాగా కామెంట్ చేయడం వివాదాస్పదం అయ్యింది. అంతేకాదు వరుస విజయాలు సాధిస్తున్నాను అంటూ చెప్పుకోబోయాడు కానీ పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా అనే ప్లాప్ చిత్రం రాగా అర్జున్ రెడ్డి సంచలన విజయం తర్వాత ఓ పేరు ఊరు లేని సినిమా వచ్చి డిజాస్టర్ అయ్యింది కూడా కాకపోతే ఆ సినిమాని గుర్తు పట్టెలోపే అది వెళ్ళిపోయింది.

అయితే హైదరాబాద్ లో జరిగిన నోటా బహిరంగ సభలో మరోలా మాట్లాడి సొంత ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసాడు విజయ్ దేవరకొండ.నోటా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి దూకుడుగా వ్యవహరిస్తున్నాడు ఈ హీరో. హీరోలకు ప్రాంతాలకు , కులాలకు , మతాలకు అతీతంగా అభిమానులు ఏర్పడతారు . ఈ విషయం చాలామంది హీరోలకు తెలుసు అయినప్పటికీ కొంత అనుచర వర్గం అంటూ ఉండాలి కాబట్టి గిరి గీసుకొని అడ్డుగోడలు నిర్మిస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ కూడా అలాంటి హీరోల జాబితాలో చేరిపోయాడా ? లేక నోటా ప్రచారం కోసమే ఇలా వ్యాఖ్యానించాడా ? అన్నది చూడాలి.

English Title: I have followers in Andhra – Vijay Devarakonda