
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గత పది నెలలుగా వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరు అజాగ్రత్తగా వున్నా వెంటాడేస్తోంది. స్టార్టింగ్తో పోలిస్తే కరోనా ప్రభావం కొంత తగ్గినట్టే అనిపించినా మళ్లీ స్వైరవిహారం చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
మెగా ఫ్యామిలీలో స్టార్ హీరో రామ్చరణ్, మరో హీరో వరుణ్ తేజ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. వీరికి పాజిటివ్ అని తేలడంతో ఈ ఇద్దరితో సన్నిహితంగా వున్న వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. తాజాగా అల్లు శిరీష్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతే కాకుండా కోవిడ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వెల్లడించారు.
`నేను రెండు సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. మనం ఆరోగ్యం కోసం నేను ఓ చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇటీవల పెళ్లికి వెళ్లాను. బయట తిరిగాను. 100 మందితో కలిసి షూటింగ్ చేశాను. జాగ్రత్తలు పాటించాను. మాస్క్ ధరించాను. శానిటైజర్ క్రమం తప్పకుండా వాడాను. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి రాకుండా వుండటం అన్నది అసాధ్యం. మనకు మనమే జాగ్రత్తలు పాటించాలి. నా విషయంలో కొంత అదృష్టం. కొంత ఆయుర్వేదం పనిచేశాయనుకుంటున్నాను` అన్నారు.
`మనం ఈ ప్రపంచంలో ఇతర జీవరాసులతో కలిసి ఎన్నో వందల ఏళ్ల నుంచి జీవిస్తున్నాం. ఆ జీవరాసుల నుంచి వచ్చే సమస్యలతో మనల్ని మనం ఎలా కాపాడు కోవాలని ఎన్నో ఏళ్ల క్రితం పురాణాల్లో పరిష్కారాలు చూపించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు శానిటైజర్ లతో పాటు మన సంప్రదాయ పద్దతులను కూడా ఫాలో అవ్వండి. ఆయుష్ క్వాతా, మృత్యుంజయ, చ్యవన్ప్రాస.. ఇవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సనాతన ధర్మాలు, ఆయుర్వేదం మన తాత ముత్తాతలు మన ప్రపంచానికి ఇచ్చిన పెద్ద బహుమతులు. వీటిని పాటించి అందరం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం` అని అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.