మోక్షజ్ఞ ఎంట్రీకి భారీ ప్లాన్స్ ఉన్నాయి : బాలయ్య


  మోక్షజ్ఞ ఎంట్రీకి భారీ ప్లాన్స్ ఉన్నాయి : బాలయ్య
మోక్షజ్ఞ ఎంట్రీకి భారీ ప్లాన్స్ ఉన్నాయి : బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఉంటుంది, వచ్చే ఏడాది మాత్రం పక్కా అంటూ గత నాలుగైదేళ్లుగా మనం వార్తలు వింటూనే ఉన్నాం. అయితే త్వరలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని మరోసారి చెప్పారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో అప్పటి నుండి పలు రకాల వార్తలు ఇండస్ట్రీలో షికారు చేయడం మొదలుపెట్టాయి. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కొన్ని రోజులు అయ్యాక లేదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అన్నారు. ఇక ఆ తర్వాత స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తాడని అన్నారు. ఇలా బోలెడన్ని వార్తలు వస్తుండడంతో నందమూరి అభిమానుల్లో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది.

దీంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు బాలయ్య. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ మోక్షజ్ఞ ఎంట్రీ పూరి జగన్నాథ్ లేదా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు. అది ఎంత వరకూ నిజం అని అడిగితే.. ఒక్క పూరి దర్శకత్వంలోనేనా.. ఇడ్లీ, ఉప్మా, సాంబార్ దర్శకత్వంలో కాదా అని సరదాగా వ్యాఖ్యానించారు బాలకృష్ణ.

వెంటనే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం భారీ ప్లాన్స్ వేసి ఉంచాను. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఎంట్రీ ఉంటుంది. అద్భుతమైన స్క్రిప్ట్స్ తన కోసం పక్కనపెట్టా అని చెప్పి అభిమానులను ఖుషీ చేసారు బాలయ్య.