జేడీ చ‌క్ర‌వ‌ర్తిగారి నుంచి చాలా నేర్చుకున్నాను – అక్ష‌త‌


జేడీ చ‌క్ర‌వ‌ర్తిగారి నుంచి చాలా నేర్చుకున్నాను - అక్ష‌త‌
జేడీ చ‌క్ర‌వ‌ర్తిగారి నుంచి చాలా నేర్చుకున్నాను – అక్ష‌త‌

జేడీ చ‌క్ర‌వ‌ర్తి హీరోగా న‌టిస్తున్న చిత్రం `70 ఎమ్‌.ఎమ్‌`. ఎన్‌.య‌స్‌.సి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్‌, ఖాసీం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ అక్ష‌త శ్రీ‌నివాస్ మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నారు.

`నేను ఈ సినిమాలో జేడీ.చ‌క్ర‌వ‌ర్తిగారికి వైఫ్‌గా న‌టించాను. ఈ మూవీ టైటిల్ గురించి చాలా మంచి అడుగుతున్నారు. ఆ పేరులోనే సినిమా క‌థ వుంది. దానికి పూర్తి అర్థం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో జేడీ చ‌క్ర‌వ‌ర్తిగారి నుంచి చాలా నేర్చుకున్నాను. సాయి కార్తీక్ సంగీతం, అంజిగారి ఫొటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌‌గా నిలుస్తాయి.

నిర్మాత‌లు చాలా క‌ష్ట‌ప‌డి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ మూవీ న‌టిగా నాకు మంచి గుర్తింపుతో పాటు పేరుని తెచ్చిపెడుతుంది. ఆర్‌.పీ, చ‌మ్మ‌క్‌చంద్ర‌ల క్యారెక్ట‌ర్స్ సూప‌ర్బ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో వైవిధ్య‌మైప సాత్ర‌ల్లో న‌టించిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న చిత్ర‌మిది. యూత్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకునే సినిమా ఇది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సినిమా ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న ల‌భించింది. యాక్ష‌న్‌, నేప‌థ్య సంగీతానికి మంచి స్కోప్ వున్న సినిమా ఇది` అని తెలిపింది.

నెక్స్ట్ మూవీస్ గురించి వెల్ల‌డిస్తూ.. ఆదాశ‌ర్మ న‌టిస్తున్న `(?)క్వోశ్చ‌న్ మార్క్` సినిమాలో మంచి పాత్ర చేశాను. అది త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే `జార్జిరెడ్డి` ఫేమ్ సందీప్ మాధ‌వ్ న‌టిస్తున్న `గంధ‌ర్వ‌`లో హీరోయిన్‌గా న‌టిస్తున్నాను. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది` అని తెలిపింది. అక్ష‌త‌.