ఎన్టీఆర్ కోసమే ఆ చిత్రంలో నటించానంటున్న భామ


Niveda thomas
Niveda thomas

ఎన్టీఆర్ అంటే ఇష్టం అందుకే ఎన్టీఆర్ కోసమే జై లవకుశ చిత్రంలో నటించానని అంటోంది అందాల భామ నివేదా థామస్ . జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రంజై లవకుశ ” . సినిమాలో నివేదా థామస్ ఒక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే . అయితే జైలవకుశ చిత్రంలో తన పాత్ర చిన్నదైనా కథలో కీలకమైన క్యారెక్టర్ కావడంతో చేసానని ఇక బ్రోచేవారెవరురా చిత్రంలో కూడా మంచి పాత్ర పోషిస్తున్నానని తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని అంటోంది నివేదా థామస్

తెలుగులో చాలా సెలెక్టివ్ గా మంచి చిత్రాలను అంతకంటే మంచి పాత్రలను ఎంచుకుంటున్న భామ తాజాగా బ్రోచేవారెవరురా చిత్రంలో నటించింది . ఈనెల 28 ప్రేక్షకుల ముందుకు వస్తోంది సినిమా దాంతో మీడియా ముందుకు వచ్చింది నివేదా థామస్ . శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రంలో రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు