ఏపికి అండగా నిలిచిన విజయ్ దేవరకొండ


I stand with you Andhra Pradesh vijay devarakonda

నేను తెలంగాణ వాడ్ని అయినప్పటికీ నాకు ఆంధప్రదేశ్ లో కూడా అభిమానులున్నారు అంటూ కాస్త కవ్వించే ప్రయత్నం చేసిన అగ్రెస్సివ్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా తన అభిమానాన్ని ఆంధప్రదేశ్ పై చాటుకున్నాడు . తిత్లి తుఫాన్ తో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలలోని సముద్ర తీర ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచుసాయి దాంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . తిత్లి సృష్టించిన బీభత్సానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , ప్రజలకు అండగా ఉండాలని భావించిన విజయ్ దేవరకొండ 5 లక్షల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కి ఆన్ లైన్ లో పంపించాడు . అంతేకాదు పంపించిన తాలూకు స్క్రీన్ షాట్ ని ట్వీట్ చేసి ఏపి కి అండగా నిలవాల్సిన సమయమిదని తన అభిమానులకు సూచించాడు కూడా .

పెళ్ళి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో అనూహ్యమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ . ఇటీవలే నోటా చిత్రంతో ఫ్లాప్ ని అందుకున్నప్పటికి సామజిక బాధ్యతని మాత్రం మరవలేదు . కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని భావించిన ఈ హీరో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కి 5 లక్షల విరాళం పంపించాడు . తీర ప్రాంతాలు తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయాయి , పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అన్నీ ప్రభుత్వమే సమకూర్చలేదు అందుకే మానవతా దృక్పథంతో విజయ్ దేవరకొండ తన హీరో ఇజాన్ని చూపించాడు . ఇప్పుడే కాదు ఇంతుముందు కేరళ వరదలతో అతలాకుతలం అయితే కేరళకు కూడా 5 లక్షల విరాళం అందించాడు విజయ్ దేవరకొండ .

English Title: I stand with you Andhra Pradesh: vijay devarakonda