నాకు నిజంగా తక్కువ కోణ౦ (లో అంగెల్) నచ్చదు కాని బాగనే వుంటుంది!


Nidhhi Agerwal
నాకు నిజంగా తక్కువ కోణ౦ (లో అంగెల్) నచ్చదు కాని బాగనే వుంటుంది!

మాహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు అని మనం ఒక సినిమాలో చూసిన, విన్న మాట ఇది. ఇప్పుడు ఈ అర్ధం ఎందుకు అంటే ట్విట్టర్ వేదికగా చాల మంది చాల రకరకాలుగా వాళ్ళకి నచ్చిన రీతిలో ట్వీట్స్ చేస్తూ కొంతమంది హాట్ టాపిక్ గా మారుతారు, అలానే తాను కూడా ఒక రాయి వేసింది మన టాలీవుడ్ నటి.

ఆమె ఎవరో కాదు గత సంవత్సరం నవంబర్ నెలలో రిలీజ్ అయిన “సవ్యసాచి” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన “నిధి అగర్వాల్“. పాపం అమ్మడికి మొదటి సినిమా ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు, సరే అన్న ద్వారా ఇవ్వలేదు తమ్ముడు అయిన అమ్మడికి హిట్ సినిమా రుచి చూపిస్తాడు అనుకుంటే అక్కడ కూడా ముదుగుమ్మకి మళ్ళీ 2 వ సినిమాగా విడుదల అయిన “అఖిల్ Mrమజ్ను” కుడా అలానే బెడిసికొట్టింది, ఇక 3 వ సినిమా ద్వారా తాన సత్తా చాటుకుంది, అది కుడా మన “పూరి జగన్నాధ్” సార్ సినిమా “ఇస్మార్ట్ శంకర్” ఇందులో సైంటిస్ట్ పాత్రలో బాగా ఒదికిపోయింది.

ఇక అసలు విషయానికి వొస్తే ఈ అమ్మడు తన నెక్స్ట్ సినిమా గురించి ఏదైన పోస్ట్ పెడుతుంది అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఏధో వింతగా ట్వీట్ చేసింది, అదేంటో అర్ధం కాక మన జనాలు బుర్ర బద్దలుకొట్టుకుంటున్నారు, ఆ ట్వీట్ ఏంటో మీరు ఒక చూపు చుడండి.

Credit: Twitter