దాంతో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ ఫోన్ బ్లాక్ చేశాను!


I was blocked thammareddy phone calls - Raghu kunche
I was blocked thammareddy phone calls – Raghu kunche

గాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ర‌ఘు కుంచె.గ‌త కొంత కాలంగా సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌లు చిత్రాల‌కు వ‌ర్క్ చేస్తున్నఆయ‌న విల‌న్‌గా న‌టిస్తూ స‌రికొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ప‌లాస 1978`. క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స‌మ‌ర్ప‌ణ‌లో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా శుక్రవారం విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ర‌ఘు కుంచె మీడియాతో ముచ్చ‌టించారు.

మైండ్ గేమ్ ఆడే విల‌న్‌గా..

గ‌తంలో ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించాను కానీ తొలిసారి ఈ చిత్రంలో ప్ర‌ధాన విల‌న్‌గా స‌రికొత్త పాత్ర‌లో న‌టించాను. ఇది నాకు చాలా స్పెష‌ల్ మూవీ. నా పాత్ర చూసిన నాగ‌శౌర్య‌ ఈ సినిమాని  త్రివిక్ర‌మ్‌గారు ముందే చూసి వుంటే `అల వైకుంఠ‌పుర‌ములో` స‌ముద్ర‌ఖ‌ని చేసిన పాత్ర‌ని మీతోనే చేయించి వుండేవారేమో అన్నారు. సినిమాలో నా పాత్ర‌కు నాలుగు వేరియేష‌న్స్ వుంటాయి. 30, 40. 50. 70 ఇయ‌ర్స్ ఇలా సాగుతుంది. సినిమా తొలి కాపీ చూసుకున్న‌ప్పుడు ఏమైనా మైన‌స్‌లు వ‌న్నాయా? అతిగా చేశానా అని చెక్ చేసుకున్నాను. సినిమాలో నా పాత్ర క‌మ‌ర్ష‌య‌ల్ చిత్రాల్లో విల‌న్‌లా కాకుండా చాలా కూల్‌గా వుంటుంది. ఎక్క‌డ అతి లేకుండా చాలా సెటిల్డ్‌గా న‌టించాను. 70 ఇయ‌ర్స్ లుక్ కోసం `నార్కోస్‌`లోని పాబ్లాస్కో క్యారెక్ట‌ర్‌ని రిఫ‌రెన్స్‌గా తీసుకుని న‌టించాను. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఇంద్రుడు చంద్రుడు చిత్రంలోని పాత్ర‌కు ద‌గ్గ‌ర‌గా ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర వుంటుంది.

ఇలాంటి సినిమా మ‌ళ్లీ చేయ‌లేనేమో..

ఒక న‌టుడిగా, కంపోజ‌ర్‌గా ఇలాంటి సినిమా మ‌ళ్లీ చేయ‌లేనేమో. న‌లుడిగా, కంపోజ‌ర్‌గా చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఒక సంగీత ద‌ర్శ‌కుడిగా నాకు ఈ సినిమా చాలా స్పెష‌ల్‌. సంగీతం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను. సినిమా షూటింగ్ 43 రోజుల్లో చేస్తే రిరికార్డింగ్ 46 రోజులు చేశాను. ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌డంతో భ‌ర‌ద్వాజ‌గారు బాగా తిట్టారు. దాంతో ఆయ‌న ఫోన్ బ్లాక్ చేశాను. నేప‌థ్య సంగీతం కోసం చాలా స‌హ‌జ‌సిద్ధ‌మైన వాయిద్యాల‌ని వాడ‌టం జ‌రిగింది. సినిమా అత్యంత స‌హ‌జ‌త్వంతో సాగుతుంది. రిరికార్డింగ్ విన్న త‌రువాత త‌మ్మారెడ్డి హ‌గ్ చేసుకున్నారు. స్క్రీన్‌ప్లే కొత్త‌గా వుంటుంది. ముందు సంగీతం చేయాల‌ని చెప్పారు. ఆ త‌రువాత విల‌న్ పాత్ర చేయాల‌న్నారు. పాత్ర న‌చ్చ‌డం వ‌ల్లే విల‌న్‌గా న‌టించాను. సినిమాలో ఉత్త‌రాంధ్ర భాష‌లో మాట్లాడ‌తాను.

ఐదుగురు కొత్త సింగ‌ర్స్‌తో…

సినిమా జాప‌ప‌ద క‌ళ వున్న సినిమా కావ‌డంతో అంతా కొత్త‌వారితో పాట‌లు పాడించాను. ఆ పాట‌ల‌న్నీ అత్యంత స‌హ‌జంగా వ‌చ్చాయి. సినిమా రిలీజ్ త‌రువాత పాట‌ల‌కు మ‌రింత ప్రాచుర్యం ల‌భిస్తుంది. ఈ సినిమాలో నా పాత్ర న‌చ్చి ఇద్ద‌రు నిర్మాత‌లు త‌మ చిత్రాల్లో విల‌న్‌గా అవ‌కాశం ఇచ్చారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాను. జాన‌ప‌దాలంటే నాకు చాలా ఇష్టం. ప‌క్కా గ్రామీణ నేప‌థ్యం నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి ఇకపై కూడా కొత్త గాయ‌కుల్ని ప‌రిచ‌యం చేస్తూనే వుంటాను.  `ప‌లాస‌`న‌టుడిగా కొత్త ప్ర‌యాణానికి నాంది ప‌లుకుతుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నాను. నా కెరియ‌ర్‌లోనే న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది.