యంగ్ హీరో నిఖిల్‌కు ఏం జ‌రిగింది?

యంగ్ హీరో నిఖిల్‌కు ఏం జ‌రిగింది?
యంగ్ హీరో నిఖిల్‌కు ఏం జ‌రిగింది?

యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `కార్తికేయ‌2`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎనిమ‌ల్ హిప్నాటిజ‌మ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `కార్తికేయ‌` చిత్రానికిది సీక్వెల్‌గా రూపొందుతోంది. ప్ర‌స్తుంతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గుజ‌రాత్‌లో జ‌రుగుతోంది.

చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌రించే క్ర‌మంలో హీరో నిఖిల్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఈ ప్ర‌మాదంలో నిఖిల్ కాలికి గాయ‌మైంది. దీంతో మేక‌ర్స్ వెంట‌నే నిఖిల్‌ని ద‌గ్గ‌ర్లో వున్న హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈ ప్ర‌మాదంపై హీరో నిఖిల్ వెంట‌నే ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌న కోసం ప్రార్థించిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

త‌న‌కు కొంత మంది పోన్‌లు చేసి యోగాక్షేమాలు అడుగుతున్నార‌ని,  కొంత మంది మెసేజ్‌లు చేస్తున్నార‌ని, మీ అంద‌రి ఆశీస్సుల‌తో రెట్టించిన విశ్వాసంతో మళ్లీ తిరిగి వ‌స్తాన‌ని నిఖిల్ ఓ ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు. తాను వేగంగా కోలుకుంటున్నాన‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.