అది కనుక రివీల్ చేస్తే జక్కన్న గొడ్డలి పట్టుకుని వస్తాడు: ఎన్టీఆర్

అది కనుక రివీల్ చేస్తే జక్కన్న గొడ్డలి పట్టుకుని వస్తాడు: ఎన్టీఆర్
అది కనుక రివీల్ చేస్తే జక్కన్న గొడ్డలి పట్టుకుని వస్తాడు: ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన విశేషాలను తెలిపి అందరిలో ఆసక్తి పెంచాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ కు ముందు తాను 71 కిలోలు ఉండేవాడినని, ఈ చిత్రం కోసం 9 కిలోలు పెరిగినట్లు తెలిపాడు. అలాగే కొమురం భీమ్ పాత్ర కోసం చాలానే హార్డ్ వర్క్ చేసినట్లు తెలిపాడు.

“ఈ పాత్ర కోసం 18 నెలలు సిద్ధమయ్యాను. కొన్ని అంశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. నవంబర్ 2018న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నాకు తెలుసు ఇది చాలా ఎక్కువ సమయం అని. అయితే రాజమౌళితో సినిమా అంటే అలానే ఉంటుంది. పైగా కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలలు పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటికీ అక్టోబర్ 13న విడుదల చేయొచ్చనే అనుకుంటున్నాము. నేను, రామ్ చరణ్ కలిసి రావడం అందరిలోనూ చాలా ఆసక్తి పెంచుతుంది అని తెలుసు. ఈ సినిమాలో ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను వావ్ అనేలా చేస్తుంది” అని తెలిపాడు ఎన్టీఆర్.

ఇంకా ఎక్కువ చెప్పాను అంటే రాజమౌళి గొడ్డలి పట్టుకుని వస్తాడు అని చమత్కరించాడు తారక్.