నాగార్జున మేనకోడలుకి విలన్ పాత్రలు కావాలట


I would love to do negative roles says supriyaఅక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ విలన్ పాత్రలు చేస్తానని , అవంటేనే నాకు ఇష్టమని అంటోంది . 22 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్సుప్రియ జంటగా నటించిన ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది . అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ కెమెరా ముందుకు రాలేదు కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత గూఢచారి సినిమాలో రా ఆఫీసర్ గా నటించింది సుప్రియ . అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నిర్వహిస్తోంది సుప్రియ , హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో పాటుగా తాత అక్కినేని నాగేశ్వర్ రావు కు కూడా సుప్రియ హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదట దాంతో సినిమాల్లో నటించడం మానేసింది .

కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత గూఢచారి సినిమాలో రా ఆఫీసర్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది . సినిమా కూడా సక్సెస్ బాట పట్టడంతో సంతోషంగా ఉంది సుప్రియ . ఇకపై కూడా సినిమాల్లో నటిస్తానని అయితే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలైతే నాకు చాలా ఇష్టమని , ఛాలెంజింగ్ రోల్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అంటోంది . అక్కినేని మనవరాలిగా పరిచయమైన సుప్రియ అప్పట్లో సక్సెస్ కాలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం సక్సెస్ అయ్యేలాగే ఉంది .

English Title: I would love to do negative roles says supriya