ఆత్మహత్యే శరణ్యమంటున్న ఆఫీసర్ బయ్యర్


iam going to suicide says officer buyerనాగార్జున హీరో కావడంతో ఎంతో ధైర్యం చేసి మరీ ఆంధ్రా హక్కులు కొన్నాడు సుబ్రహ్మణ్యం అనే కొత్త బయ్యర్ , అయితే సినిమా డిజాస్టర్ కావడంతో షాక్ కి గురైన సదరు బయ్యరు ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ వేడుకుంటున్నాడు . అత్యంత దయనీయంగా ఉన్న ఈ సంఘటనతో సినిమా రంగంలోని వాళ్ళు షాక్ అవుతున్నారు . రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ చిత్రం పై నమ్మకం లేకపోవడంతో ఆ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు .

అయితే జిల్లా స్థాయిలో చిన్న చిన్న సినిమాలు కొనే సుబ్రహ్మణ్యం అనే బయ్యర్ ధైర్యం చేసి నాగార్జున మీద నమ్మకంతో ఆఫీసర్ చిత్రాన్ని ఆంధ్రా హక్కులు మూడున్నర కోట్ల కు కొన్నాడు , పబ్లిసిటీ , వడ్డీలు కలుపుకొని మరో యాభై తో నాలుగు కోట్ల వరకు అయ్యిందట ! అంత డబ్బు పెట్టి కొన్న సినిమా కు కనీసం 25 లక్షలు కూడా వచ్చేలా లేకపోవడంతో తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని బోరు మంటున్నాడు పాపం . వర్మ నాగార్జున ఇమేజ్ ని బాగానే క్యాష్ చేసుకున్నాడు కానీ ఆ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం లబోదిబోమంటున్నారు .