నేను ఐసీయూలో వున్నాను – హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌


iam in icu - actor harshavardhan rane
iam in icu – actor harshavardhan rane

తెలుగు, హిందీ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న న‌టుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌రాణే ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డ్డారు. మైల్డ్ గా సిమ్ట‌మ్స్ క‌నిపించ‌డం, భ‌రించ‌లేని త‌ల‌నొప్పి, లైట్గా ఫీవ‌ర్ వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో హర్షవర్ధన్ రాణే ఓ హాస్పిట‌ల్‌కి వెళ్లార‌ట‌. అక్క‌డ ఆయ‌న‌ని టెస్ట్ చేసిన డాక్ట‌ర్స్ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో తనకు కోవిడ్ -19 అని నిర్ధారణ అయిందట‌.

ఆ త‌రువాత డాక్ట‌ర్ల స‌ల‌హాల మేర‌కు హోమ్ ఐలోలేష‌న్‌లో వుంటూ చికిత్స పొందుతున్న ఆయ‌న త‌ల‌నొప్పి, జ్వ‌రం త‌గ్గ‌క‌పోవ‌డంతో తిరిగి డాక్ట‌ర్ల‌ని మ‌రోసారి సంప్ర‌దించ‌డంతో త‌నని ఐసీయూలో వుంచార‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే వెల్ల‌డించాడు. అయితే అక్క‌డ ఏమంత బాగాలేద‌ని, ఊహించ‌డానికే చాలా ఇబ్బంది క‌రంగా వుంద‌ని చెప్పుకొచ్చాడు.

`తీవ్రమైన తలనొప్పి, కొంచెం జ్వరంతో ప్రారంభమైంది. నాలుగు రోజుల తర్వాత కూడా తలనొప్పి తగ్గనప్పుడు నేను ఒక ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ వారు వైరల్ జ్వరం అని కొట్టిపారేశారు. అయినప్పటికీ వారు కోవిడ్ 19 పరీక్ష చేసారు అందులో పాజిటివ్ అని తేలింది. రెండు రోజుల తర్వాత కూడా నాకు జ్వరం, తలనొప్పి నుండి ఉపశమనం లభించనప్పుడు నేను మరోసారి ఆసుపత్రికి వెళ్ళాను. వారు నన్ను వెంటనే ఐసియులో చేర్పించారు` అని త‌న కోవిడ్ సంగ‌తుల్ని పంచుకున్నారు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాణే.