చంద్రబాబుని అరెస్ట్ చేస్తానంటున్న ఎస్పీ


If chandrababu naidu not attend we will arrest says nanded sp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 21 లోగా పోలీసుల ముందు లొంగిపోతే ఓకే లేదంటే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చుతామని సంచలన వ్యాఖ్యలు చేసాడు నాందేడ్ ఎస్పీ కతార్ . ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్ట్ వద్ద చేసిన ఆందోళనకు గాను చంద్రబాబు నాయుడుతో పాటుగా మరో 15 మంది నాయకులను కోర్టు ముందు హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే . అయితే ఇన్నాళ్ల నుండి పట్టించుకోలేదు కానీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే ఇలా వేధింపు చర్యలకు దిగుతున్నారని తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నాందేడ్ ఎస్పీ స్పందించాడు .

ఇప్పటికిప్పుడే చేపట్టిన చర్యలుగా అభివర్ణిస్తున్నారు కానీ ఈ ప్రక్రియ అయిదేళ్ల క్రితమే మొదలయిందని , అయిదేళ్ల క్రితమే అందరికీ నోటీసులు పంపించామని , ఇప్పుడు మాత్రమే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని ఒకవేళ చంద్రబాబు సకాలంలో పోలీసుల ముందు హాజరుకాకపోతే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు నాందేడ్ ఎస్పీ కతార్ . సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడైన చంద్రబాబుని కోర్టు కీడ్చడం వల్ల బిజెపి పట్ల , మోడీ పట్ల మరింత వ్యతిరేకత పెరగడం ఖాయం .

English Title: If chandrababu naidu not attend we will arrest says nanded sp