హీరోనే ప్రెగ్నెంట్ అయితే…?

హీరోనే ప్రెగ్నెంట్ అయితే...?
హీరోనే ప్రెగ్నెంట్ అయితే…?

ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక కొత్త‌ద‌నం లేక‌పోతే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌ల‌కు రాని ప‌రిస్థితి. దీన్ని గ‌మ‌నించిన మేక‌ర్స్ ప్ర‌తీ క‌థ‌, క‌థ‌నం ద‌గ్గ‌రి నుంచి హీరో క్యారెక్ట‌రైజేష‌న్ వ‌రకు అంతా కొత్త‌గా, విభిన్నంగా వుండేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలా కొత్త‌ద‌నంతో తెర‌కెక్కిన చిత్రాలే బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

అందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణే `ఉప్పెన‌`. చ‌క్క‌ని ప్రేమ‌క‌థ‌గా రూపొందిన ఈ చిత్రంలో త‌న కూతురు ప్రేమించింది ఓ జాల‌రిని అని తెలిసిన తండ్రి త‌న కూతురు ప్రేమించిన వాడిని హ‌త్య చేయ‌కుండా అత‌ని మ‌ర్మాంగాన్ని తీసేయ‌డం.. ఈ విష‌యాన్ని చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌గా చూపిస్తూ ద‌ర్శ‌కుడు క‌థ‌ని న‌డిపించిన తీరు ప్రేక్ష‌కుల‌ని షాక్‌కు గురిచేసింది. ఇదే త‌రహాలో ప్రేక్ష‌కుల‌ని ఆశ్చ‌ర్యానికి, షాక్‌కు గురిచేసే క‌థ‌, క‌థ‌నాల‌తో ఓ యువ‌ హీరో సినిమా తెర‌కెక్కుతోంది.

భార‌తీయ తెర‌పై ఇంత వ‌ర‌కు ఈ త‌ర‌హా ప్ర‌యోగం ఎవ‌రూ చేయ‌లేదు. ఇందులో హీరో ప్రెగ్నెంట్ కావ‌డ‌మే అస‌లు విచిత్రం. హీరో ప్రెగ్నెంట్ అయితే ఏం జ‌రిగింది?  అన్న‌దే ఇందులో షాక్ కు గురిచేసే అంశం.ఇటీవ‌లే 25 ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీ గెలుచుకుని, మెగాస్టార్ ప్ర‌శంస‌లు సైతం ద‌క్కించుకున్న యువ‌కుడు ఈ మూవీ ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించ‌నున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.