తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు – ఖచ్చితంగా ఫలితం దక్కుతుందితండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు - ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది
తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు – ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది

మాస్ట్రో “ఇళయరాజా” సంగీత ప్రియులకి 3 పూటలా భోజనం కూడా అవసరం లేని పేరు. అతను స్వర పరిచిన పాటలు అంతలా ప్రాచుర్యం పొందాయి కాబట్టి , మన  పెద్దల కాలం నుండి ఆ మహానుభావుడి పాటలు వర్ణానాతీతం,ఆ పాటలకి కానీ, ఆ పాటల ట్యూన్స్ కి కానీ ఒక పేరు అంటు ఉండదు, కేవలం సినిమా చూడడానికి ఆ మహానుభావుడి పాటల కోసం వెళ్లిన వాళ్లు కుడా వున్నారు.

అయితే గత కొంతకాలంగా తాను విరామం తీసుకున్నారు, అయితేనేం తన వారసుడు “యువన్ శంకర్ రాజా” తండ్రికి తగ్గ తనయుడుగా అనతి కాలంలోనే బాగా పేరు సంపాదించుకున్నాడు, తండ్రి లాగానే కేవలం ఒక పరిశ్రమకి అంటూ పనిచేయలేదు, తనకి అవసరం ఉన్నప్పుడల్లా వివిధ బాషలలో, ఈ తరం వాళ్ళకి ఎలా అయితే పాటలు కావాలో అలానే చేస్తున్నాడు అంటే తన తండ్రి నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకున్నాడు అని ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.

అయితే ఇక్కడ సంగీత ప్రియులకి మరియు సగటు సినిమా ప్రేక్షకులకి తీపి కబురు, ఇప్పటి వరకు తండ్రి కొడుకులు కలిసి ఒక సినిమా కి పనిచేయడం జరగలేదు, బహుషా దేవుడి కరుణ తో ఇద్దరు కలిసి ఒక సినిమా కి స్వరాలు సమకూరుస్తున్నారు, అనగా ఇద్దరు ఒక సినిమా కి “మ్యూజిక్ డైరెక్టర్స్” గా పని చేయడం జరుగుతుంది. అది తమిళ సినిమాకి , అది కూడా తమిళ ఇండస్ట్రీ లో బాగా పేరు మోసిన హీరో “విజయ్ సేతుపతి” సినిమాకి ఇది నిజంగా మనం ఆనందించాల్సిన విషయం.

ఇక యువన్ శంకర్ రాజా తాజాగా తన ట్విట్టర్ లో తన సంతోషాన్ని వెలుబుచ్చుకున్నాడు. అది మీకోసం మేము అందిస్తున్న చిరు కానుక.