ఇలియానాకి మరో బంపర్ ఆఫర్ తగిలేసినట్టేనా?


ఇలియానాకి మరో బంపర్ ఆఫర్ తగిలేసినట్టేనా?
ఇలియానాకి మరో బంపర్ ఆఫర్ తగిలేసినట్టేనా?

2006లో దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. రావడమే సంచలనాలకు కేంద్ర బిందువైంది. రెండో సినిమానే మహేష్ బాబుతో పోకిరి సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఇక అక్కడి నుండి ఇలియానా వెనుతిరిగి చూసింది లేదు. వరసగా తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారితో ఆడిపాడింది. ఒక ఆరేళ్ళు టాలీవుడ్ ను ఊపేసిన ఇలియానా సడెన్ గా బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా ఆమెకు ఘనస్వాగతమే లభించింది. అక్కడ చేసిన మొదటి సినిమా బర్ఫీ ఆమెకు అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టాయి. దాంతో పాటు పలు సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంది. అయితే కొంత కాలానికే ఇలియానా హవా బాలీవుడ్ లో తగ్గిపోయింది. సినిమాలు రావడం కూడా తగ్గాయి.

లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లోకి అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ ఏడాది బాలీవుడ్ లో చేసిన పాగల్ పంటి సినిమా యావరేజ్ గా ఆడటంతో ఆమెకు పెద్ద కలిసొచ్చింది అంటూ ఏం లేదు. మరోవైపు ఆండ్రుతో ప్రేమాయణం, బ్రేకప్ వంటి కారణాలతో ఆమె సినిమాలను కూడా కొంచెం లైట్ తీసుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా చెప్పుకోవడానికి సినిమాలేం లేవు. ది బిగ్ బుల్ అనే సినిమా చేస్తోంది కానీ రిలీజైతే కానీ దాని గురించి చెప్పలేం. పెద్ద బజ్ లేని సినిమా అది. కెరీర్ మొదట్లో మంచి షేప్ లో ఉన్న ఇలియానా ప్రేమాయణం తర్వాత పూర్తిగా షేపవుట్ అయిపోయింది.

అయితే మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఇప్పుడు తిరిగి వర్కౌట్స్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆమెకు కోలీవుడ్ నుండి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా అజిత్ సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. అజిత్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు విజయవంతమవుతున్నాయి. లేటెస్ట్ గా చేసిన పింక్ రీమేక్ నెర్కొండ పార్వై చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన హెచ్ వినోద్ ఈసారి తన కథతో అజిత్ తో మరో సినిమా చేయబోతున్నాడు. గతంలో వినోద్ చేసిన శతురంగ వెట్టై, ఖాకి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇలియానాకు ఛాన్స్ అంటే అది తనకు లైఫ్ లైన్ వంటిదే. ఈ వార్త కనుక నిజమై సక్సెస్ అయిందంటే ఇలియానాకు సౌత్ నుండి మరికొన్ని ఆఫర్లు రావడం పక్కా. మరి ఏం జరుగుతుందో చూడాలి.